బెజవాడలో రెచ్చిపోతున్న బైక్‌ రేసర్లు

x
Highlights

బెజవాడలో యువకులు బైక్ రేసింగ్‌లతో రెచ్చిపోతున్నారు. అర్థరాత్రివేళ మితిమీరిన వేగంతో బైకులను దూకిస్తున్నారు. దీంతో రోడ్డుపై వెళుతున్నవారు భయపడే...

బెజవాడలో యువకులు బైక్ రేసింగ్‌లతో రెచ్చిపోతున్నారు. అర్థరాత్రివేళ మితిమీరిన వేగంతో బైకులను దూకిస్తున్నారు. దీంతో రోడ్డుపై వెళుతున్నవారు భయపడే పరిస్థితి నెలకొంది. కనకదుర్గమ్మ వారధి, కృష్ణలంక నేషనల్ హైవేపై ఈ బైక్ రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలే ఇరుకు రోడ్లు, ఇలాంటి రోడ్లపై సాధారణ ప్రయాణమే కష్టం. అలాంటి చోట రేస్‌లంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు పెద్దగా కనిపించడంలేదు. బడాబాబుల కొడుకులు కూడా రేసింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. గతంలో రేసింగ్‌ల వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. అయినా బైక్ రేసింగ్‌లు మాత్రం ఆగడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories