దేశవ్యాప్తంగా కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళితుల దేశవ్యాప్త బంద్...
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళితుల దేశవ్యాప్త బంద్ కొనసాగుతోంది. సంవిధాన్ బచావో సంఘర్ష్ కమిటీ అనే దళిత సంఘం ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలు భారత్ బంద్‌లో పాల్గొన్నాయి. ఎస్సీ, ఎస్టీలను వేధించినట్లు ఆరోపణలొస్తే నిందితులపై అట్రాసిటీ కింద క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయడాన్ని నిలిపివేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశం
అయితే ఆదేశాలు తమను కించపరిచేలా ఉన్నాయని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందన్న వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దళితుల నిరసనలు మిన్నంటాయి. అందులో భాగంగానే దళిత సంఘాలు ఇవాళ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే దీనిపై స్పందించిన కేంద్రం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధమైనా ఆందోళనలు విరమించేది లేదని దళిత సంఘాలు కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చాయి.
దళిత సంఘాల నిరసనలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. బంద్ విరమించుకోవాలని దళిత సంఘాలను కోరారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌తో దళిత సంఘాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం విడ్డూరమని రవిశంకర్‌ప్రసాద్ అన్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT