బీసీలు ఎందరు?

బీసీలు ఎందరు?
x
Highlights

రాష్ట్రంలో బీసీలు ఎందరినీ, ఇక మొదలైంది శోధన, అందరికీ అభివృద్ధి అందాలని, చేస్తున్నారట ఈ సాధన. శ్రీ.కో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం...

రాష్ట్రంలో బీసీలు ఎందరినీ,

ఇక మొదలైంది శోధన,

అందరికీ అభివృద్ధి అందాలని,

చేస్తున్నారట ఈ సాధన. శ్రీ.కో

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిజర్వేషన్ల పరంగానే గాక బీసీ సంక్షేమ పథకాల అమలు, బీసీ, ఎంబీసీల విభజన, పంచాయతీలతో పాటు పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో రిజర్వేషన్లు వంటి వాటికి సైతం బీసీల జనగణన అవసరమనే అభిప్రాయాన్ని మంత్రిమండలి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై వివాదాల కారణంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఏర్పడిన విషయం తెలిసిందే. శాస్త్రీయంగా బీసీల జనాభా ఎంత, వారికి ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిన సంగతి విదితమే. దీనిపై మంత్రిమండలిలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద బీసీలకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories