బండెన్క బండి గట్టి - గట్టిగా నిలబడ్డ పాట!

బండెన్క బండి గట్టి - గట్టిగా నిలబడ్డ పాట!
x
Highlights

కొన్ని పాటలు ప్రజలను కదిలిస్తాయి..ఉద్యమాలకు ఉపిరి పోస్తాయి...అలా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి, ఉత్తేజితపరిచిన పాటల్లో ఇది...

కొన్ని పాటలు ప్రజలను కదిలిస్తాయి..ఉద్యమాలకు ఉపిరి పోస్తాయి...అలా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి, ఉత్తేజితపరిచిన పాటల్లో ఇది ప్రముఖమైనది. దీనిని సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పనిచేసిన, నల్గొండ జిల్లాకు చెందిన జి.యాదగిరి వ్రాశాడు. సాయుధ పోరాటం కథా వస్తువుగా నరసింగరావు తీసిన మా భూమి చిత్రంలో యాదగిరి పాత్ర పోషించిన ప్రజా గాయకుడు గద్దర్ ఈ పాట పాడాడు.
బండెన్క బండి గట్టి, పదహరు బండ్లు గట్టి

యే పల్లే బోతవ్ కొడుకో నైజాము సర్కరోడా

నాజీల మించినవ్ రో నైజాము సర్కరోడా
||బండెన్క బండి గట్టి||
పోలీసు మిల్ట్రీ రెండు బలవంతులానుకోని

నువు పల్లెలు దోస్తివి కొడుకో, ఓహో పల్లెలు దోస్తివి కొడుకో

అహ పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా
||బండెన్క బండి గట్టి||
జాగీరుదారులంతా, జామీనుదారులంతా

నీ అండా జేరి కొడుకో నీ అండా జేరి కొడుకో

నైజాము సర్కరోడా
||బండెన్క బండి గట్టి||
ఈ పాట మీరు ఇప్పటికి వినకుంటే తప్పక ఒక సారి వినండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories