బ్రేకింగ్... గుండెపోటుతో బాలసాయి బాబా కన్నుమూత!

బ్రేకింగ్... గుండెపోటుతో బాలసాయి బాబా కన్నుమూత!
x
Highlights

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజికవేత్త బాలసాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ విరించి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కర్నూలు జిల్లాకు...

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజికవేత్త బాలసాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ విరించి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ఆధ్యాత్మిక భోదనలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ ఉదయం గుండెపోటుకు గురై మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయిబాబాపై అనేక అరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు. ఆయన పేరిట కర్నూలు ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆయన మరణంపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories