కిడాంబీ శ్రీకాంత్ ఇక ప్రపంచ నంబర్ వన్

కిడాంబీ శ్రీకాంత్ ఇక ప్రపంచ నంబర్ వన్
x
Highlights

తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య...

తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య మరికొద్దిగంటల్లో ప్రకటించే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం కిడాంబీ శ్రీకాంత్ టాప్ ర్యాంక్ ప్లేయర్ కానున్నాడు. గత సీజన్లో ఐదు సూపర్ సిరీస్ ఫైనల్స్ చేరడంతో పాటు నాలుగు టోర్నీల్లో విజేతగా నిలిచిన శ్రీకాంత్ మొత్తం 76వేల 895 పాయింట్లతో...ప్రస్తుత నంబర్ వన్, డేనిష్ ఆటగాడు విక్టర్ యాక్సెల్ సన్ ను అధిగమించాడు. 1980లో ప్రకాశ్ పడుకోన్ 2015లో సైనా నెహ్వాల్ పురుషుల, మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులు సాధిస్తే...ఆ తర్వాత అదే ఘనతను కిడాంబీ శ్రీకాంత్ సొంతం చేసుకోబోతున్నాడు. కంప్యూటర్ ద్వారా అధికారిక ర్యాంకింగ్స్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచిన భారత తొలి ఆటగాడు కిడాంబీ శ్రీకాంత్ మాత్రమే కావడం విశేషం. అంతేకాదు గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న 2018 కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారిగా భారత్ కు మిక్సిడ్ టీమ్ గోల్డ్ అందించడంలో ప్రధానపాత్ర వహించిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ లో సైతం స్వర్ణపతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories