పాఠశాల బస్సు కిందపడి చిన్నారి మృతి

పాఠశాల బస్సు కిందపడి చిన్నారి మృతి
x
Highlights

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోపిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి అవ్య మృతి చెందింది. స్థానికంగా ఉంటున్న...

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోపిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి అవ్య మృతి చెందింది. స్థానికంగా ఉంటున్న శంకర్‌రెడ్డికి ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల పాప ఉంది. శంకర్‌రెడ్డి బాబును స్కూల్‌కు పంపించే నిమిత్తం ఇంటి ముందు ఉన్న స్కూల్ బస్సు ఎక్కించాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి తండ్రి వెనకాలే పరిగెత్తుకుంటూ రెండేళ్ల చిన్నారి రోడ్డుపై నిల్చుంది. అయితే చిన్నారిని గుర్తించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో చిన్నారిపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది.

చిన్నారి మృతదేహాన్ని చూసి తండ్రి కుప్పకూలిపాయాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సును అక్కడే నిలిపివేసి డ్రైవర్‌ను పట్టుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. అయితే బస్సు టైర్ల వద్ద చిన్నారి కనిపించలేదని డ్రైవర్ చెబుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి వరకూ ఆడుకుంటూ ఉన్న చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories