తెలుగు సినీ పరిశ్రమకు ఏమైంది?

x
Highlights

టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఫోకస్ చేసిన ఆయన మన హీరోలకు పోరాడే చేవ చచ్చిపోయిందా అని...

టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఫోకస్ చేసిన ఆయన మన హీరోలకు పోరాడే చేవ చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై అన్ని వర్గాలు పోరాడుతున్న సమయంలో ఒక్క సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉండటంపై ఆయన భగ్గుమన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనడటం లేదని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టును నిషేదించిన సమయంలో అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముందుండి ఉద్యమాన్ని నడిపించారని అలాంటి వారు ఇక్కడ కరువయ్యారా అని ప్రశ్నించారు. హీరోయిన్ల అందాలను వర్ణించడమే తప్ప మన హక్కుల కోసం, న్యాయం కోసం పోరాడేది లేదా అని అన్నారు. అవార్డులు రాకపోతే రచ్చ రచ్చ చేసే హీరోలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నలు సంధించారు. బానిస బతుకులు ఇంకెన్నాళ్లని ఇకనైనా ఆంధ్రల హక్కుల కోసం నడుం బిగించాలన్నారు. లేకపోతే తెలుగు సినీ పరిశ్రమను బహిష్కరిస్తామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories