తల్లీకొడుకుని కాపాడబోయి ఆటో డ్రైవర్ మృతి

తల్లీకొడుకుని కాపాడబోయి ఆటో డ్రైవర్ మృతి
x
Highlights

ఆత్మహత్య చేసుకోబోతున్న తల్లీకొడుకులను కాపాడబోయి ఓ ఆటో డ్రైవర్ తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ...

ఆత్మహత్య చేసుకోబోతున్న తల్లీకొడుకులను కాపాడబోయి ఓ ఆటో డ్రైవర్ తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో తన కొడుకుతో సహా మీథాపూర్‌ కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. వీరిని గమనించిన ఓ ఆటోడ్రైవర్ వెంటనే వారిని కాపాడటానికి అందులోకి దూకాడు. వారిని కాపాడడానికి కుదరలేదు. ఈ క్రమంలో స్థానికులు కొందరు గమనించి అతికష్టం మీద తల్లీకొడుకుని కాపాడగలిగారు.. కానీ డ్రైవర్ మాత్రం నీటిలోనే మునిగిపోయాడు. కానీ ఆయన ఆచూకీ మాత్రం దొరకలేదు. తల్లీకొడుకుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories