టీడీపీలో ఇంటి పోరు....తగ్గేది లేదంటున్న కన్నబాబు

x
Highlights

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. అక్కడ నియోజకవర్గ ఇన్ చార్జిని మార్చాలన్న టీడీపీ అధినేతల ఆలోచన బెడిసి కొట్టింది...

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. అక్కడ నియోజకవర్గ ఇన్ చార్జిని మార్చాలన్న టీడీపీ అధినేతల ఆలోచన బెడిసి కొట్టింది ఇన్ చార్జి వ్యవహారం వివాదాస్పదమైంది మాజీ మంత్రి ఆదాలకు, కన్న బాబుకు మధ్య రేగిన గొడవేంటి? పరిష్కారం ఎంత వరకూ వచ్చింది?

ఆత్మకూరు నియోజకవర్గం ఒకప్పడు ఇది టీడీపీకి పెట్టని కోట రెడ్డి, కమ్మ సామాజికవర్గాలే ఆధిపత్యంగా ఉన్న ఈ నియోజకవర్గంలో రెండు సామాజికవర్గాలూ ముఫై ఏళ్లలో సమానంగా ప్రాతినిధ్యం వహించాయి గతఎన్నికల్లో టీడీపీ నుంచి కొత్తగా తెరపైకొచ్చిన గూటూరు మురళీ కన్నబాబు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేసిన గౌతమ్ చేతిలో పరాభవం చవిచూశారు. ఇక్కడ కన్నబాబు ఓటమి చవిచూసినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నబాబును ఆ జిల్లా ఇన్ చార్జిగా నియమించారు.

రెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్టంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరారు దాంతో కన్నబాబు ఇన్ చార్జి బాధ్యతలను ఆనంకు అప్పగించారు. అప్పటి నుంచి కన్నబాబు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే ఈ మధ్య ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరతారన్న వార్తలు రావడంతో మరోసారి ఇన్ చార్జి పదవిపై కన్నబాబు ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని పార్టీ కేడర్ సైతం కన్నబాబే నియోజకవర్గ బాధ్యుడిగా భావించారు. అయితే అధిష్టానం చేసిన కొన్ని అంతర్గత సర్వేల్లో ఎన్ డీసీసీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి తెరపైకి వచ్చారు. వీరిద్దరిలో నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఆత్మకూరులో రెండు సామాజికవర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి దాంతో సమస్య పరిష్కారం అధ్యక్షుడే చేయాలంటూ ఆ వ్యవహారాన్ని అమరావతికి మార్చారు.

రాష్టంలో అన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జిల నియామకంలో భాగంగా ఆత్మకూరు తాత్కలిక ఇన్ చార్జి బాధ్యతలను జిల్లాలోని పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న మాజీ మంత్రి ఆదాలకు అప్పగించారు. ఈ పరిణామం గూటూరు కన్నబాబు వర్గానికి మింగుడు పడలేదు ఆది నుంచి పార్టీనే నమ్మకున్న తమకు బాధ్యతలు ఇవ్వకుండా మరొకరికి అప్పగించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం ఇలా వివాదంలో ఉండగానే నిన్న ఆత్మకూరులో తాత్కలిక ఇన్ చార్జి ఆదాల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ పర్యటనను రెండు రోజుల క్రితం ఖరారు చేశారు. దీంతో కన్నబాబు అనుచరులు భగ్గుమన్నారు.

పార్టీని కాపాడేది, నిర్మాణం చేసేది మేము నాయకత్వం మరొకరికా అంటూ కన్నబాబు వర్గం సోషల్ మీడియా వేదికగా తాము రాజీనామాలు చేస్తున్నట్లు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. సమస్యని రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తుండగానే గత రాత్రి కన్నబాబు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎన్టీయార్ విగ్రహం దగ్గర ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. అర్దరాత్రి వరకు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర కన్నబాబుతో చర్చించినా ఫలితంలేదు కన్నబాబు ఆమరణ దీక్షను కొనసాగించారు. తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న మాజీ మంత్రి ఆదాల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నందున తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందంటూ కన్నబాబు జిల్లా నేతలకు వివరణ ఇచ్చారు.

ఇద్దరి మధ్యా రేగిన ఈ గొడవపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం మాజీ మంత్రి ఆదాల ఇంట్లో సమావేశం నిర్వహించి కన్న బాబు వైఖరిపై సుదీర్ఘంగా చర్చించారు కన్న బాబుకు తాత్కాలికంగా సర్ది చెప్పి దీక్షా స్థలి నుంచి లేపి తీసుకెళ్లారు అయినా సమస్య పరిష్కారం అయ్యే వరకూ తగ్గేది లేదంటున్నారు కన్న బాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories