ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే అమ్మో, నాన్నో చచ్చిపోతారు..

x
Highlights

ఆ అమ్మాయిని చేసుకుంటే.. అమ్మో, నాన్నో పోతారని అబ్బాయిని బెదరకొట్టాడో జ్యోతిష్యుడు. ఇందేం న్యాయమని పెళ్లి కూతురు బంధువులు జ్యోతిష్యుడి ఇంటి ముందు...

ఆ అమ్మాయిని చేసుకుంటే.. అమ్మో, నాన్నో పోతారని అబ్బాయిని బెదరకొట్టాడో జ్యోతిష్యుడు. ఇందేం న్యాయమని పెళ్లి కూతురు బంధువులు జ్యోతిష్యుడి ఇంటి ముందు ఆందోళనకి దిగారు. గొడవ పెద్దది కావడంతో వరుడు మాత్రం పుట్టిన తేదీలే తేడాగా ఉన్నాయని తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.

సిద్దిపేట శ్రీనగర్ కాలనీకి చెందిన పొన్నమల్లు లక్ష్మి, వెంకటయ్య కుమారుడు అనిల్ కు, సిద్దిపేట మండలం పొన్నాల మధిర గ్రామమైన బట్రాంపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ, నర్సింలు కుమార్తె స్వప్నతో రెండుమూడు నెల్ల క్రితమే వివాహం నిశ్ఛయమైంది. గత రెండుమూడు నెలలుగా శుభముహుర్తాలు లేక పోవడంతో ఫిబ్రవరి 22న ఎంగేజ్మెంట్, మార్చి 8న పెళ్లికి ముహుర్తాలు పెట్టుకున్నారు. ఈ మేరకు పెళ్లికుమార్తె తరపు వారు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసుకున్నారు.

ఇదిలా ఉండగా పెళ్లికుమారుడు అనిల్ సిద్దిపేటలోని రాజుపంతులు జ్యోతిషుడికి అమ్మాయి పుట్టిన తేదీ ప్రకారం జాతకం చూపించాడు. పెళ్లి కుమార్తె జాతకం ప్రకారం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్తకు లేదా మామకు ప్రాణహాని తప్పదని చెప్పడంతో ఈ పెళ్లి పెళ్లి కుమారుడు అనిల్ నిరాకరించాడు. దింతో ఆందోళనకు గురైన పెళ్లి కూతురి తరుపు బందువులు జ్యోతిష్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై జ్యోతిష్యుడిని నిలదీయడంతో పెళ్లికుమారుడు చూపిన జాతకం ప్రకారం అమ్మాయి పేరు మీద బలం లేదని, పెరు మార్చుకోవాలని మాత్రమే సూచించానంటున్నాడు.

మొదట ఆడిగినపుడు డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పి, ఇపుడు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అడపెళ్లి వారిపై పెళ్లి కుమారుడు అనిల్ ఆరోపిస్తున్నాడు. ఈ పెళ్లి తాను చేసుకోనని తెగేసి చెబుతున్నాడు.
ఈ నెల 22న ఎంగేజ్మెంట్, 8 న పెళ్లికి అన్ని సిద్ధం చేసుకున్నామని, ఇప్పుడిలా జ్యోతిషుడి మాటలు నమ్మి తమకు అన్యాయం చేస్తారా అని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు పెళ్లి కొడుకు అనిల్, జ్యోతిష్కుడు రాజు పంతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories