నీతి తప్పిన పోలీసు అధికారులపై వేటు

నీతి తప్పిన పోలీసు అధికారులపై వేటు
x
Highlights

అనైతిక వ్యవహారాలతో పోలీస్‌శాఖ పరువును బజారుకీడ్చిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఏసీబీ ఎఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి కేసులో ఇద్దరిపైనా...

అనైతిక వ్యవహారాలతో పోలీస్‌శాఖ పరువును బజారుకీడ్చిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఏసీబీ ఎఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి కేసులో ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు పడింది. సురేంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట కల్వకుర్తి సీఐపై వేటు పడింది. తర్వాత వివాదస్పద వ్యవహారశైలితో పోలీస్ శాఖ పరువు తీశారని భావించిన ప్రభుత్వం సునీతారెడ్డిపై కూడా వేటు వేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదికను పోలీసులు, డీజీపీకి అందించారు.

అక్రమ సంబంధం కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఏసీబీ ఎఎస్పీ సునీతా రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. సునీతా రెడ్డి భర్త సురేంద్రరెడ్డి ఫిర్యాదు మేరకు మొదట సీఐ మల్లికార్జునరెడ్డిని సస్పెండ్ చేశారు. అనంతరం భర్త కంప్లైంట్ ఆధారంగా సునీతా రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. వివాదస్పద వ్యవహారశైలితో పోలీస్ శాఖ పరువు తీశారని భావించిన ప్రభుత్వం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ కేసులో సంచలన ఆరోపణలు చేశారు సురేంద్ర రెడ్డి. తన ఇంట్లోనే భార్యతో పాటు ఉన్న మల్లికార్జున రెడ్డిని.. తన కుటుంబ సభ్యుల సహాయంతోనే పట్టుకున్నానని సురేంద్రరెడ్డి తెలిపారు. 2016లోనే సునీతా రెడ్డి, మల్లికార్జున రెడ్డిల వ్యవహారం బయట పడిందన్నారు. ఆ సమయంలో మల్లికార్జున రెడ్డి తనను ఇబ్బందిపెట్టినట్టు సునీతారెడ్డి తనకు చెప్పిందన్నారు సురేంద్రరెడ్డి. అప్పట్లో పెద్దల సమక్షంలో రాజీకి వచ్చిన సునీతా.. తనను మోసం చేసిందని తెలిపారు. ఆమెను క్షమించడమే నేరమైందన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసిన ఏఎస్పీ సునీతరెడ్డి భర్త సురేంద్రరెడ్డి.. ఈ కేసులో కొన్ని సాక్ష్యాధారాలు డీజీపీకి, పోలీసులకి ఇచ్చానని చెప్పారు.

సునీతారెడ్డి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు.. పూర్తి వివరాల నివేదికను డీజీపీకి, ప్రభుత్వానికి అందజేశారు. దర్యాపులో భాగంగా సునీతారెడ్డి, సురేంద్రరెడ్డి, సునీతారెడ్డి తల్లి, అత్తలతో పాటు మల్లికార్జున రెడ్డి స్టేట్ మెంట్లు పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో అవసరమైతే ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలంటూ సునీతారెడ్డి, మల్లికార్జున రెడ్డిలను పోలీసులు ఆదేశించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories