ఆమ్‌ఆద్మీలో రాజీనామాల రాజ్యం

ఆమ్‌ఆద్మీలో రాజీనామాల రాజ్యం
x
Highlights

ఆమ్‌ఆద్మీ పార్టీకి షాక్‌ల మీద షాక్ వచ్చే, ఆ పార్టీ సీనియర్‌ నేత అశుతోష్‌ రాజీనామాతో వచ్చే, మరో నేత ఆశిష్‌ కేతాన్‌ రాజీనామా కూడా ఇపుడు తెచ్చె, ...

ఆమ్‌ఆద్మీ పార్టీకి షాక్‌ల మీద షాక్ వచ్చే,

ఆ పార్టీ సీనియర్‌ నేత అశుతోష్‌ రాజీనామాతో వచ్చే,

మరో నేత ఆశిష్‌ కేతాన్‌ రాజీనామా కూడా ఇపుడు తెచ్చె,

కేతాన్‌ టికెట్‌ ఆశిస్తే, పార్టీ అంగీకరించక ఇదంతా వచ్చేనా ఏమి. శ్రీ.కో.


ఆమ్‌ఆద్మీ పార్టీకి మరో షాక్‌ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ సీనియర్‌ నేత అశుతోష్‌ రాజీనామా విషయం ప్రజలు, నేతలు మరిచి పోకముందే, మరో నేత ఆశిష్‌ కేతాన్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా లేఖను ఆగస్టు 15నే పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిల్లీ ప్రభుత్వ సలహా మండలి అయిన దిల్లీ డైలాగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ (డీడీసీ) నుంచి ఏప్రిల్‌లోనే తాను తప్పుకున్నానని, న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టానని కేతాన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇదే వృత్తిపై తాను దృష్టి సారించానని తెలిపారు. రాజీనామా విషయాన్ని మాత్రం ఆయన ఖండించలేదు. ఆప్‌- కేంద్రం మధ్య వివాదం నేపథ్యంలో డీడీసీ నుంచి కేతాన్‌ తప్పుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు కేతాన్‌ టికెట్‌ ఆశించారని, పార్టీ అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories