అసద్ ఇంట పెళ్లి సందడి

nanireddy
Updated on: 28 Dec 2018 12:16 PM IST
అసద్ ఇంట పెళ్లి సందడి
X

హైదరాబాద్‌ ఎంపీ... మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఇంట్లో పెళ్లి హడావిడిగా మొదలయింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, విద్యాసంస్థల అధినేత నవాబ్‌ అహ్మద్‌ ఆలం ఖాన్‌ కుమారుడు నవాబ్‌ బర్కత్‌ ఆలం ఖాన్‌ తో అసదుద్దీన్‌పెద్ద కుమర్తె ఖుద్సియా ఒవైసీ నిఖా ఎల్లుండి జరగనుంది. పెళ్లి వేడుకతో పాతబస్తీ సందడిగా మారింది. వేడుకల్లో భాగంగా మంజా.. సంగీత్‌.. సాంచాలాంటి కార్యక్రమాలకు వేదికలు సిద్ధమవుతున్నాయి. కూతురి పెళ్లి వేడుకలకు ప్రతి బస్తీ నుంచి జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నారు అసదుద్దీన్. పార్టీ కార్పొరేటర్లు.. కార్యకర్తలతోపాటు మసీదు కమిటీ ప్రతినిధులకు ప్రతిఒక్కరికి అందేలా పెళ్లి పత్రికలు పంచుతున్నారు. కాగా ఈ పెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవనున్నట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story