‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా రివ్యూ ...ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ మాటలు సమేతంగా ఫసాక్ హిట్టు

‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా రివ్యూ ...ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ మాటలు సమేతంగా ఫసాక్ హిట్టు
x
Highlights

ఇద్దరు వ్యక్తుల , రెండు గ్రామాల మద్య.. లేదా రెండు సమూహాల మద్య.. పగ ప్రతీకారం.. అప్పుడు హీరోయిజం లా అనిపించినా, ఈ హింస... లేదా......

ఇద్దరు వ్యక్తుల , రెండు గ్రామాల మద్య.. లేదా రెండు సమూహాల మద్య.. పగ ప్రతీకారం.. అప్పుడు హీరోయిజం లా అనిపించినా, ఈ హింస... లేదా... నరుక్కోవటం..కొట్టుకోవటం తర్వాత వారి జీవితాల లోని మార్పులు... వారి మీదే ఆధారపడిన వారి జీవితాలపై ప్రభావం ఎలా ఉంటుది... అనే విషయాన్నీ ఒక కొత్త కోణంలో చెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు, మొదటి ఇరవై నిమిషాల సినిమా త్రివిక్రమ్ పరిగెత్తించాడు... అరవింద సమేత ఒక యాక్షన్ చిత్రం, నల్లగుడి, కొమ్మడి అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ, ఓ చిన్న గొడవ చిలికి చిలికి రెండు గ్రామాల మధ్య పెద్ద వైరం అవుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసుకున్న యుద్ధం, హింస తర్వాత ఒక శాంతిపర్వం. ఇది 2 గంటల 42 నిమిషాల సినిమా.. ఈ సినిమా కథ రాయలసీమ ప్రాంతంలో ఇది ఫ్యాక్షన్ డ్రామా. వీర రాఘవ రెడ్డి (జూనియర్ ఎన్టీఆర్) అరవింద్ (పూజా హెగ్డే) ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అరవిందని అందుకోవాలనే క్రమలో... తరతరాల హింసని...అలాగే తనని తను తెలుసుకుంటూ... గెలిచే చిత్రం ఇది. అరవింద సమేత హింస మరియు దయ మధ్య నలిగిపోయే వ్యక్తి యొక్క అంతర్గత పోరాటం గురించి రక రకాల మలపులతో నడుస్తుంది. కథ మాములుగానే వున్నా ... త్రివిక్రమ్ మాటలు తూటాల్ల పేలాయి, అలాగే ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపెట్టాడు. కొంచెం త్రివిక్రమ్ ఎంటర్టైన్మెంట్ తగ్గింది, కాని మిగిలిన భావాలూ బాగానే పండాయి. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories