‘అరవింద సమేత వీర రాఘవ‌’ మూవీ రివ్యూ

‘అరవింద సమేత వీర రాఘవ‌’ మూవీ రివ్యూ
x
Highlights

టైటిల్ : అరవింద సమేత వీర రాఘవ జానర్ : యాక్షన్‌ డ్రామా తారాగణం : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, నవీన్‌ చంద్ర, రావూ రమేష్‌...

టైటిల్ : అరవింద సమేత వీర రాఘవ
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, నవీన్‌ చంద్ర, రావూ రమేష్‌
సంగీతం : తమన్‌ ఎస్‌
దర్శకత్వం : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. దీంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. టీజర్‌, ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. మరి అంచనాలు అరవింద సమేత అందుకుందా..? ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడా..? త్రివిక్రమ్‌ తన మార్క్‌ డైలాగ్స్‌, టేకింగ్‌తో పాత ఫామ్‌ను అందుకున్నాడా?

కథ : రాయ‌ల‌సీమ‌లోని కొమ్మత్తి అనే గ్రామంలో బ‌సిరెడ్డి (జగపతి బాబు ), నారప రెడ్డి ( నాగబాబు) వర్గాల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. నార‌ప‌రెడ్డి కుమారుడు వీర‌రాఘ‌వ‌రెడ్డి లండ‌న్‌లో చ‌దువుకుని స్వగ్రామం వ‌స్తాడు. వీర‌రాఘ‌వ‌రెడ్డిని అంత‌మొందించేందుకు బ‌సిరెడ్డి వ‌ర్గం చేసిన దాడిలో నార‌ప‌రెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రులు చ‌నిపోతారు. ఈ గొడ‌వ‌ల‌కు దూరంగా వీర‌రాఘ‌వ‌రెడ్డి సిటీకి వెళ‌తాడు. అక్క‌డ వీరారాఘ‌వ‌కు నీలాంబ‌రి (సునీల్‌) ప‌రిచ‌యం అవుతాడు. ఈ క్రమంలోనే వీర‌రాఘ‌వుడికి అర‌వింద (పూజా హెగ్డే)తో ప‌రిచ‌యం ఏర్పడుతుంది. సీమ‌లో ఫ్యాక్షనిజానికి చ‌ర‌మ‌గీతం పాడి… అక్కడ శాంతియుత వాతావరణం కోసం పోరాడే వీర రాఘవ అనుకున్నది సాధించాడా ? ఫ్యాక్షన్ వల్ల అత‌డు ఏం కోల్పోయాడు ? చివ‌ర‌కు త‌న ల‌క్ష్యం నెర‌వేరిందా ? అర‌వింద‌తో అత‌డి ప్రేమాయ‌ణం ఎలా ముగిసింది ? అన్న ప్రశ్నల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.

విశ్లేషణ: గ‌తంలో ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. వాట‌న్నింటికీ భిన్నంగా త్రివిక్ర‌మ్ ఎలా తీస్తాడా? అని అభిమానులు ఎదురుచూశారు. అందుకు త‌గిన‌ట్లుగానే త్రివిక్ర‌మ్ కొత్త అంశాన్ని ఎంచుకున్నారు. ‘అద‌ర్‌సైడ్ ఆఫ్ ఫ్యాక్ష‌నిజం’ అన్న‌ట్లు వేరే కోణం చూపించారు. క‌త్తి ప‌ట్టుకుని బ‌య‌లుదేరిన భ‌ర్త గురించి అత‌ని భార్య, తండ్రి గురించి పిల్ల‌లు ఎంత త‌ల్ల‌డిల్లిపోతారో వాళ్ల కోణంలో చూపించారు. మొద‌టి ఇర‌వై నిమిషాల క‌థ చాలా ప‌క‌డ్బంధీగా సాగుతుంది. ఎమోష‌న‌ల్‌గా బాగా డ్రైవ్ చేశాడు. ఈ సినిమాలో ఎమోష‌న్ కంటెంట్ ఉంటుంద‌ని ఒక ర‌కంగా ప్రేక్ష‌కుడిని ముందే సిద్ధం చేశాడు. క‌థ హైద‌రాబాద్ చేరిన త‌ర్వాత తేలిక ప‌డుతుంది. హీరో, హీరోయిన్‌, సునీల్ వీరి మ‌ధ్య స‌న్నివేశాల‌తో అక్క‌డ‌క్క‌డా త్రివిక్ర‌మ్ త‌న మార్కుని చూపిస్తూ క‌థ‌ను సాఫీగా ముందుకు తీసుకెళ్లాడు. ఎన్టీఆర్‌ సినిమా అంటేనే వన్‌ మెన్‌ షోలా సాగుతుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు. చాలా మంది నటీనటులు ఉన్నా.. ఎన్టీఆర్‌ అంతా తానే అయ్యి సినిమాను నడిపించాడు. ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఆకట్టుకుంది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె ఆకట్టుకుంటుంది. గ్లామర్‌ పరంగానూ మంచి మార్కులు సాధించింది. విలన్‌ పాత్రలో జగపతి బాబు జీవించాడు. నీలాంబ‌రిగా సునీల్ ఆక‌ట్టుకుంటాడు. తమన్‌ సంగీతం సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. పాటలతో రిలీజ్‌కు ముందే ఆకట్టుకున్న తమన్‌.. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్‌నే మార్చేశాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ లో తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. పీఎస్‌ విందా సినిమాటోగ్రపి సినిమాకు మరో ఎసెట్‌. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories