అధికారులకు చుక్కలు చూపించిన రెహ్మాన్ కచేరి

అధికారులకు చుక్కలు చూపించిన రెహ్మాన్ కచేరి
x
Highlights

బీచ్ ఫెస్టివల్ చివరి రోజు సాయంత్రం మొజార్ట్ ఆఫ్ మద్రాస్.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీత విభావరికి ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచే...

బీచ్ ఫెస్టివల్ చివరి రోజు సాయంత్రం మొజార్ట్ ఆఫ్ మద్రాస్.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీత విభావరికి ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెహమాన్ అభిమానులు కాకినాడ బీచ్ కి క్యూ కట్టడంతో సాగరతీరం జనసంద్రంగా మారింది. దాదాపు 3 లక్షల మందికి పైగా రెహ్మాన్ కచేరికి వచ్చారని అంచనా. కాన్సర్ట్ ప్రారంభమైన కాసేపటికే తొక్కిసలాట మొదలైంది. దీంతో భయపడిన చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక కార్యక్రమం ముగిశాక అందరికీ చుక్కలు కనపడ్డాయి. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. పోలీసులు కూడా చేతులెత్తేసి వెళ్లిపోయారు. ఆ చిమ్మచీకట్లోనే నానా తంటాలు పడి ఇళ్లకు చేరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories