పోలవరం గ్యాలరీ సందర్శనకు బయలుదేరిన ప్రజాప్రతినిధులకు తప్పిన ప్రమాదం

x
Highlights

విజయవాడ నుంచి పోలవరం గ్యాలరీ సందర్శనకు బయలుదేరిన ప్రజాప్రతినిధులకు మార్గం మధ్యలో ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు...

విజయవాడ నుంచి పోలవరం గ్యాలరీ సందర్శనకు బయలుదేరిన ప్రజాప్రతినిధులకు మార్గం మధ్యలో ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలోకి రాగానే మట్టిలో దిగబడటంతో వారి ప్రయాణానికి కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. అయితే, బస్సులో ఉన్న 35మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేరే వాహనాల్లో పోలవరంకి పంపారు. పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణం పూర్తయ్యింది. డ్యాం నీటి ఊటను తిరిగి పంపుల ద్వారా.. రిజర్వాయర్ లోకి నీటిని పంపేందుకు గ్యాలరీ నిర్మించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ సందర్శనకు.. శాసన సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో బయలుదేరారు. ఉదయం 10గంటల 5 నిమిషాలకు సీఎం చంద్రబాబు స్పిల్ వే పైలాన్ ఆవిష్కరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories