రోజుల తరబడి..నెలల తరబడి ఫ్రీజ్ చేసిన మాంసాహారం...బిర్యానీలకు స్టైలిష్ డెకరేషన్స్ చేసి ఆఫర్లు

x
Highlights

విశాఖ లో అతిధ్య రంగం రోజురోజుకు పెరుగుతుంది. నగర జనాభా తో పాటు మైగ్రేటడ్స్ కూడా పెరుగుతున్నారు. దీనికి తోడు పర్యాటక నగరం, దేశ, విదేశాల నుండి రోజు...

విశాఖ లో అతిధ్య రంగం రోజురోజుకు పెరుగుతుంది. నగర జనాభా తో పాటు మైగ్రేటడ్స్ కూడా పెరుగుతున్నారు. దీనికి తోడు పర్యాటక నగరం, దేశ, విదేశాల నుండి రోజు అతిధులు వస్తూ పోతూ వుండే డెస్టినేషన్ ఇక ఏముంది హోటల్స్ వారికి మూడు పువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం సాగుతుంది. రోజుల తరబడి నెలల తరబడి ఫ్రీజ్ చేసిన మాంసాహారం, బిర్యానీలకు స్టైలిష్ డెకరేషన్స్ చేసి ఆఫర్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఇది గమనించలేని ఆహార ప్రియులు వేడి వేడి విందు భోజనాలను ఆర్డర్స్ ఇస్తూ మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.

నగరంలోని పలు హోటళ్లలో కుళ్లిన మాంసం పరార్థాలతో పాటుగా నిల్వ ఉంచిన బిర్యానీ, కోడి మాంసం, చేపలు, రొయ్యలు, తందూరి చికెన్‌, వెజ్‌ మంచూరియా వంటి వంటకాలు రెండు, మూడు రోజులకు పైబడి ఫ్రిజ్‌లలో నిల్వచేసి విక్రయిస్తున్నారు. కుళ్లిపోయిన కేబేజీ, ఉల్లిపాయలు, క్యారెట్‌లతో పాటు పాడైపోయిన మసాలా, ధనియాలు పొడి వంటి పదార్థాలను ఉపయోగించడంతో పాటు ఆకర్షణీయంగా కనిపించేదుకు హనికరమైన రంగులను వాడుతూ ఆహరా పదార్ధాలను తయారు చేస్తున్నారు. వ్యాపారం పేరుతో ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కాసులకు కక్కుర్తి పడుతున్నారు.

రోజుల తరబడి నిల్వ ఉన్న ఆహారాన్నే భోజన ప్రియులకు వడ్డిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విశాఖలోని కొన్ని హోటళ్లపై దాడులు చేశారు. డాబాగార్డెన్స్‌ ప్రాంతంలో గల బొంబే రెస్టారెంట్‌, బీచ్‌రోడ్డులో గల పంజాబీ గ్రిల్స్‌, తందూరి వాలా హోటళ్లలో విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టారు. ఫ్రిజ్ లో రోజుల తరబడి నిల్వ ఉంచిన వస్తువులను గుర్తించారు. ఫుడ్ సేప్టీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

హోటళ్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఆహారపదార్ధాలు తింటున్న వారిలో జీర్ణకోశ సంబంధమైన వ్యాదులు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. చుసారుగా హోటల్స్ నిర్వహాణ జీహ్వచాపల్యం పక్కన పెట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట ను గ్రహించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. సో వైజాగ్ పబ్లిక్ బీ అలర్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories