కేసుల మాఫీ కోసం జగన్ లాలూచీ పడ్డారు

కేసుల మాఫీ కోసం జగన్ లాలూచీ పడ్డారు
x
Highlights

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవినీతి పరులకే అండగా నిలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీయే నుంచి బయటకు...

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవినీతి పరులకే అండగా నిలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు తెలిపిన చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీ హోదా పేరుతో నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీతో పొత్తు వదులుకున్నందుకు ముస్లీం వర్గాలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపాయి. ముఖ్యమంత్రి నివాసంలోని ప్రజాదర్బార్ హాల్ లో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ముస్లీం ప్రముఖులతో చంద్రబాబు సమావేశమయ్యారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నందుకు చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు వివరించారు. చివరి బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదాను కూడా కేంద్రం పెద్దలు పట్టించుకోలేదని చంద్రబాబు తెలిపారు. తనపై యుద్దం చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారని న్యాయం కోసం ప్రశ్నిస్తే యుద్ధం చేస్తారా అని ప్రశ్నించారు.

బీజేపీ తనను అణగదొక్కాలని చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కేసుల మాఫీ కోసం అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీతో జగన్ లాలూచీ పడ్డారని కేంద్రం పెద్దలను పదే పదే కలవడం వెనక కారణాలేంటో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఇన్నాళ్లూ తమతో బాగున్న పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు విమర్శిస్తున్నారని ప్రజలు దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారు కూడా రాజకీయాలు చేస్తున్నారని ద్రోహులకు డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories