‘వీక్లీఆఫ్‌లతో పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్’

‘వీక్లీఆఫ్‌లతో పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్’
x
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న వంచన వ్యతిరేక దీక్షపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఏం...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న వంచన వ్యతిరేక దీక్షపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఏం సాదిద్దామని వంచన వ్యతిరేక దీక్షలు చేస్తున్నారని మండిపడ్డ పుల్లారావు. కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని వెనుకేసుకు రావడం తప్ప వంచన దీక్షలు ఏమి సాధించడానికి చేస్తున్నారో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు వంచన, మోసం కలిపితే జగన్ అవుతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రత్తిపాటి. రాష్ట్రాన్ని వంచించింది జగన్‌మోహన్‌రెడ్డి కాదా అని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా చేసిన వారు టీడీపీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి అన్నారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడి కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విక్లీ ఆఫ్ తీసుకుని పాదయాత్ర చేస్తున్న నేత వైఎస్ జగన్ అంటూ... పాదయాత్రపై సెటైర్లు వేశారు పుల్లారావు.

Show Full Article
Print Article
Next Story
More Stories