ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో...

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 62శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 75శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 48శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4,78,621 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,95,891 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. బాలురు 57శాతం, బాలికలు 67శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories