logo
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మందుబాబులకు శుభవార్త!

ఏపీలో మందుబాబులకు శుభవార్త!
X
Highlights

న్యూఇయర్‌‌కి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారనుంది. అధిక ఆదాయమే లక్ష్యంగా బార్లు, మద్యం దుకాణాలకు ఏపీ సర్కార్‌...

న్యూఇయర్‌‌కి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారనుంది. అధిక ఆదాయమే లక్ష్యంగా బార్లు, మద్యం దుకాణాలకు ఏపీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. న్యూఇయర్‌ వేడుకల్లో మందుబాబులతో వీలైనంత ఎక్కువగా మద్యం తాగించి డబ్బు పిండుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రేపు, ఎల్లుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ బార్లలో మద్యం విక్రయాలకు పర్మిషన్‌ ఇచ్చింది. అలాగే అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం దుకాణాలకు కూడా అనుమతి ఇచ్చింది. డబ్బు పిండుకోవడమే లక్ష్యంగా అనుమతులిచ్చిన ఏపీ సర్కార్‌ న్యూఇయర్‌ వేడుకల కోసం ఇప్పటికే 315కోట్ల రూపాయలకు పైగా సరుకు మద్యం దుకాణాలకు చేరింది. ఇది గతేడాదితో పోలిస్తే 25శాతం అధికమని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. రేపు, ఎల్లుండి ప్రత్యేక అనుమతులు ఇవ్వడంతో పెద్దఎత్తున విక్రయాలకు మద్యం దుకాణదారులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Next Story