ఏపీలో రూ.235కే ఇంటర్నెట్..జాతికి అంకితం చేయనున్న రాష్ట్రపతి

ఏపీలో రూ.235కే ఇంటర్నెట్..జాతికి అంకితం చేయనున్న రాష్ట్రపతి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ ఏపీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా రూ.235కే...

ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ ఏపీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా రూ.235కే ఇంటర్నెట్, ఫోన్ కాల్ సదుపాయం, 250టీవీ ఛానళ్లు, వీడియో కాలింగ్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించనుంది. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 27న జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,03,613 గృహాలకు ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు ఇచ్చారు.10 లక్షల గృహాలకు కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.
కరెంటు స్తంభాలే ఆధారం!
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా భూ సొరంగ మార్గానా ఫైబర్ ఆఫ్టిక్ లైన్లు వేయడానికి రూ.5వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. అయితే కేవలం రూ.330కోట్లతో 23,800 కరెంట్ స్తంభాలకు ఓఎఫ్ సీ లైన్లను వేశారు. ఆ లైన్లు వేయలేని చోట ఫ్రీ స్పేస్‌ ఆప్టిక్‌ కనెక్షన్‌ (ఎఫ్‌ఎస్‌ఓసీ) పరిజ్ఞానంతో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో గూగుల్ తన సేవల్ని అందించననుంది. గూగుల్ సాంకేతిక పరిజ్ఞానంతో 20 కిలోమీటర్ల పరిధిలో తీగలు లేని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలందించనుంది.
బాక్సులే కీలకం..!
డిజిటల్ ఏపీ ప్రాజెక్ట్ లో ఒక ఇంటికిగానీ, సంస్థకుగానీ ఫైబర్‌ నెట్‌ సేవలందించాలంటే జిపాన్‌ బేసిక్‌, ఐపీటీవీ రెండు రకాల బాక్సులు అవసరం. వాటిని 3.8 లక్షల జిపాన్‌ బాక్సులు, 1.21 లక్షల ఐపీటీవీ బాక్సులు ప్రభుత్వం అందించనుంది. ఈ రెండిటినీ కలిపి కస్టమర్‌ ప్రెసిసెస్‌ ఎక్విప్‌మెంట్‌ (సీపీఈ)గా వ్యవహరిస్తారు.
రూ.235కే అన్నీ..!
డిజిటల్ ఏపీలో అన్నీ రూ.235కే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వాటిలో రూ. 149 ఛార్జీ , రూ.35-36 పన్నులు, రూ.50 ట్రిపుల్‌ ప్లే బాక్స్‌లకు వసూలు చేయగా వాటిలో రూ.149లో రూ.110 ఎంఎస్‌ఓ, కేబుల్‌ ఆపరేటర్లకు, రూ.39 ప్రభుత్వానికి చెందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories