ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం...ఈ నెల 10న...

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం...ఈ నెల 10న...
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. నవంబర్ 30వ తేదీ నుంచి డీఎస్సీ...

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. నవంబర్ 30వ తేదీ నుంచి డీఎస్సీ రాతపరీక్షలు నిర్వహించి, వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తారు. వాయిదా పడుతూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. డీఎస్సీని ఏపీపీఎస్సీ లేదా విద్యాశాఖ ద్వారా నిర్వహించాలని చర్చించిన ప్రభుత్వం చివరకు విద్యాశాఖ ద్వారానే పోస్టులు భర్తీ చయాలని నిర్ణయించింది.

ఈ డీఎస్సీలో మొత్తం 9,270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్‌ 30న పరీక్ష నిర్వహించి వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. కేబినేట్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రితో చర్చించి తుది ప్రకటన విడుదల చేస్తామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను పెంచాలన్న అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో వాటి సంఖ్యను పెంచే అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories