తన కార్యాలయంలోకి సైకిల్‌పై వెళ్లిన చంద్రబాబు

తన కార్యాలయంలోకి సైకిల్‌పై వెళ్లిన చంద్రబాబు
x
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సైకిల్ తొక్కారు. సచివాలయం 2వ బ్లాక్ నుంచి తన కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళారు. సచివాలయంలో స్మార్ట్...

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సైకిల్ తొక్కారు. సచివాలయం 2వ బ్లాక్ నుంచి తన కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళారు. సచివాలయంలో స్మార్ట్ సైకిళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఓ సైకిల్ ను తొక్కుకుంటూ వెళ్ళారు.

అమరావతి సచివాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉద్యోగులు, సందర్శకులు, ఫిర్యాదుదారులకు 24 సైకిళ్లను అందుబాటులోకి తెచ్చారు. వీటి కోసం సెక్రటేరియట్ ప్రాంగణంలో 3 ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సైకిల్ ను సుమారు రూ. లక్ష చెల్లించి కొనుగోలు చేసింది ప్రభుత్వం. వాయు కాలుష్య రహిత అమరావతిలో భాగంగా సైకిళ్ల వాడకాన్ని అలవాటుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో సైకిల్ సవారీ కోసం ప్రత్యేకంగా ట్రాక్ లు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వివరించారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories