బాబ్లీ ఎపిసోడ్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు

x
Highlights

బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం...

బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి సీఎం హారతిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బాబ్లీ ఎపిసోడ్, నాన్ బెయిలబుల్ వారెంట్లపై ఫస్ట్ టైం స్పందించారు. తాను ఎక్కడ అన్యాయం చేయలేదన్నారు సీఎం చంద్రబాబు. ఏ పనిచేసినా ప్రజల కోసమేనని చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టులపై ప్రాజెక్టులు కడితే, ఉత్తరతెలంగాణ ఎడారి అవుతుందనే నిరసన తెలిపడానికి అక్కడికి వెళ్లామని చంద్రబాబు తెలిపారు. అప్పట్లో నిరసన తెలిపడానికి వెళ్లిన తమను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారని బాబు ఆరోపించారు. అధికారం ఉన్నా.. లేకపోయినా, ప్రజాహితం కోసమే పని చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories