కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌పై స్పందించిన చంద్రబాబు

కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌పై స్పందించిన చంద్రబాబు
x
Highlights

రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న కేసీఆర్‌ కామెంట్స్‌‌కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు రావొచ్చని...

రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న కేసీఆర్‌ కామెంట్స్‌‌కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు రావొచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జ్ఞాన భేరిలో పాల్గొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి రావొచ్చన్నారు. ఎన్టీఆర్‌ టీడీపీని తెలుగుజాతి కోసం పెట్టారని గుర్తు చేసిన చంద్రబాబు కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి కోసం పని చేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories