అనంత రాజకీయాలపై ముఖ్యమంత్రి దృష్టి...ఐదు నియోజకవర్గాలపై రాజకీయ సమీక్షలు

అనంత రాజకీయాలపై ముఖ్యమంత్రి దృష్టి...ఐదు నియోజకవర్గాలపై రాజకీయ సమీక్షలు
x
Highlights

గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పాడునందించిన అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి...

గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పాడునందించిన అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు, సర్వేలు చేపడుతున్న చంద్రబాబు నేట్నుంచి రెండ్రోజులపాటు జిల్లాలో మకాం వేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాబు పర్యటన సాగనుంది. ముఖ్యంగా 5 నియోజకవర్గాల ముఖ్యనేతలతో చంద్రబాబు రాజకీయ సమీక్షలు సాగనున్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో జరగనున్న సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గోనున్న చంద్రబాబు అనంతరం కప్పలబండలో గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆ తర్వాత మారాలలో జలహారతి, వనం మహోత్సవాల్లో పాల్గోనున్నారు. అలాగే మారాల గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసగించనున్నారు. రాత్రికి అనంతపురం చేరుకోనున్న చంద్రబాబునాయుడు పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేడర్‌‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

మొత్తం రెండ్రోజులపాటు అనంతపురం జిల్లాలోనే ఉండనున్న చంద్రబాబు పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా గ్రూపు రాజకీయాలు, అసమ్మతి, విభేదాలను పక్కనబెట్టి, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. అయితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు, విభేదాలు పదేపదే రచ్చకెక్కుతుండటంతో చంద్రబాబు పర్యటన ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories