ప్రపంచంలోనే ఇది పెద్ద జోక్: చంద్రబాబు

ప్రపంచంలోనే ఇది పెద్ద జోక్: చంద్రబాబు
x
Highlights

దేశంలో పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పెట్రోల్‌పై పైసా తగ్గించడం ప్రపంచంలోనే పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు....

దేశంలో పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పెట్రోల్‌పై పైసా తగ్గించడం ప్రపంచంలోనే పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. మోదీ అనుసరిస్తున్న విధానాలతో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో చిన్నా, పెద్దా అందరినీ వేధిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు సమస్యలను మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని... ఆయన దారుణమైన పాలనకు వ్యతిరేకంగా 10 రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం లేదని విమర్శించారు.

ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని మోదీ మట్టి-నీరు ఇచ్చి వెళ్లిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ఆయన కేంద్రంపై ధ్వజమెత్తారు. గుజరాత్‌పై ఉన్న అభిమానం ఏపీపై లేదని... ధొలేరాపై ఉన్న ప్రేమ అమరావతిపై లేదన్నారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు పంపలేదని అమిత్‌ షా పచ్చి అబద్ధాలు చెప్పారని చంద్రబాబు మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories