ప్రధాని ఏపీ పర్యటనపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు

ప్రధాని ఏపీ పర్యటనపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు
x
Highlights

ప్రధాని ఏపీ పర్యటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఒక్కసారి రాని ప్రధాని పార్టీ పనుల కోసం వస్తున్నారంటూ ఆక్షేపించారు....

ప్రధాని ఏపీ పర్యటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఒక్కసారి రాని ప్రధాని పార్టీ పనుల కోసం వస్తున్నారంటూ ఆక్షేపించారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వంచించిన ప్రధాని పర్యటనకు అంతా దూరంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ తీరుకు వ్యతిరేకంగా జనవరి 1న నిర్వహించే ఆందోళనలో అందరూ పాల్గొనాలంటూ సూచించారు. మోదీ పర్యటనపై జగన్‌, పవన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన చంద్రబాబు కేంద్రం సహకరించడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. పార్టీ నేలతో ఈ ఉదయం నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories