కడప స్టీల్‌ ఫ్యాక్టరీపై ఏపీ కేబినెట్‌లో చర్చ

x
Highlights

కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం లేదని అభిప్రాయపడిన మంత్రివర్గం, రాయలసీమ...

కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం లేదని అభిప్రాయపడిన మంత్రివర్గం, రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రైవేట్‌ సంస్థతో కలిసి ప్రభుత్వ జాయింట్‌ వెంచర్‌ దిశగా ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం, నెలలోగా కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. విభజన హామీల్లో భాగంగా కేంద్రం నెరవేర్చని పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. కడప స్టీల్‌ ప్లాంట్‌తో పాటు రామాయపట్నం పోర్ట్‌ ఏర్పాటుపైనా చర్చించిన మంత్రివర్గం కేంద్రం సాయం చేయకున్నా విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేలా ప్లాన్‌ చేస్తోంది.

రూ. 8,300 కోట్లతో 42 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో
- ప్రపంచంలోనే పీపీపీ మోడల్‌లో నిర్మితమవుతున్న రెండో అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు వైజాగ్ మెట్రో, 4,200 కోట్ల రుణం ఇచ్చేందుకు కొరియా ప్రభుత్వం ముందుకొచ్చింది.
- గాజువాక-కొమ్మాది- 30 కి.మీ, గురుద్వారా- ఓల్డ్ పోస్టాఫీసు-5.25 కి.మీ..
- తాటిచెట్లపాలెం- వాల్తేరు మధ్య 6.5 కి.మీ మెట్రో రైలు
- అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
- గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. కాగా రామాయపట్నం పోర్ట్ ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories