ఫేస్‌బుక్‌ లో మరో కేటుగాడు

x
Highlights

ఫేస్‌బుక్‌ అడ్డగా.. ఆడవారిని నయవంచన చేసే గుంట నక్కల సంఖ్య.. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న పాన్ షాప్ ఓనర్ ఆగడాలు మరువక...

ఫేస్‌బుక్‌ అడ్డగా.. ఆడవారిని నయవంచన చేసే గుంట నక్కల సంఖ్య.. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న పాన్ షాప్ ఓనర్ ఆగడాలు మరువక ముందే.. తాజాగా ఏలూరులో అలాంటి ఘటనే వెలుగుచూసింది. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అమ్మాయిల నుంచి బంగారు ఆభరాణాలను దోచుకునే ఓ వ్యక్తిని కటకటాల్లోకి పంపారు.. పోలీసులు.

ఫ్రెండ్ రిక్వెస్ట్‌ పంపిస్తూనే.. ప్రేమను నటిస్తారు.. ముద్దులొలికే మాటలతో ఛాటింగ్ చేస్తారు.. నేనున్నా అంటూ భరోసా ఇస్తారు.. పర్సనల్ డిటైల్స్ అడుగుతారు.. ఫోటోస్ పంపమంటారు..

ఒక్కసారి ఆ అమాయకపు మాటలకు లొంగారా..? అమ్మాయిలూ.. ఇక అంతేసంగతులు. మీరు వాడి చేతికి చిక్కినట్లే. తర్వాత వాడు చెప్పినట్లు వినాల్సిందే. మూడు రోజుల క్రితం.. హైదరాబాద్‌లో మయూర్ పాన్ షాప్ ఓనర్.. ఫేస్ బుక్ అడ్డాగా.. అమ్మాయిలను మోసం చేసిన తీరును తెలుసుకుని.. నెటిజెన్స్ నోరెళ్లబెట్టారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిలకు మత్తు మందు కలిపిన స్వీట్ పాన్‌ను ఇవ్వడం.. తర్వాత వారిపై అత్యాచారం చేయడం వంటి దారుణాలు చూసి అవాక్కయ్యారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమ్మాయిలను మోసం చేసే ఓ మాయగాడి బాగోతం బట్టబయలైంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తూ.. వారి డిటైల్స్‌ను కలెక్ట్ చేసి బ్లాక్ మెయిల్‌కు చేస్తున్న చిన్నపల్లి ముకేశ్ అనే వ్యక్తిని.. త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అమ్మాయిలతో పరిచయం పెంచుకుని.. వారిని మాయమాటలతో తన బుట్టలో వేసుకునే ముకేశ్.. వారి పర్సనల్ డిటైల్స్, ఫోటోస్‌ను కలెక్ట్ చేసి బెదిరించే వాడు. బంగారు ఆభరణాలే లక్ష్యంగా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవాడు.

ముకేశ్‌ మాటలకు బెదిరిపోయిన అమ్మాయిలు.. తమ దగ్గరున్న బంగారాన్ని అప్పజెప్పేవారు. ఏలూరుకు చెందిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ముకేశ్‌ను అరెస్ట్ చేశామన్న ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు.. ఆరా తీస్తే.. గాజువాకలో కూడా ఇలాంటి క్రైమ్ చేసినట్లు.. తేలిసిందని.. వెల్లడించారు. అయితే అమ్మాయిల నుంచి ఇలా దోచుకున్న బంగారంతో ముకేశ్.. గోవాకు చెక్కేసేవాడు. అక్కడ రకరకాల గేమ్స్ ఆడుతూ.. ఎంజాయ్ చేసేవాడని.. అతని నుంచి.. 53.5 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఇలాంటి గుంట నక్కల విష‍యంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న అమ్మాయిలు కూడా పోలీసులను సంప్రదించాలని.. వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని.. ఈశ్వరరావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories