ఆఖరికి అన్నమయ్య వీరు తీసారు

ఆఖరికి అన్నమయ్య వీరు తీసారు
x
Highlights

కొన్ని కథలు చేయాలనీ ఎంతో మంది.. హీరోలు.. నిర్మాతలు.. చాల కృషి చేస్తారు.. కానీ చాలామంది చేయలకే పోతారు... ఆ తర్వాత మరొకరు దానిని సాధిస్తారు.. అలా...

కొన్ని కథలు చేయాలనీ ఎంతో మంది.. హీరోలు.. నిర్మాతలు.. చాల కృషి చేస్తారు.. కానీ చాలామంది చేయలకే పోతారు... ఆ తర్వాత మరొకరు దానిని సాధిస్తారు.. అలా జర్గినవే ... అల్లూరి సీతారామరాజు సినిమా అయినా.... అన్నమయ్య సినిమా అయిన... 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు. సినీ కవి ఆత్రేయ 18 పాటలను కూడా రికార్డు చేయించి స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ, ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా 1997లో అది సాకారం అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే. అలా మొత్తానికి అన్నమయ్యని తెరపై చూపించే భాగ్యం వీరు సంపాదించారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories