ఏపీకి మరో వాయుగుండం పొంచి ఉందా..?

ఏపీకి మరో వాయుగుండం పొంచి ఉందా..?
x
Highlights

వాయుగుండం అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం మచిలీపట్నానికి 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. అది క్రమంగా బలపడి 24 గంటల్లో తుపానుగా మారే...

వాయుగుండం అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం మచిలీపట్నానికి 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. అది క్రమంగా బలపడి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

వాయుగుండం అల్పపీడనంగా మారినందున తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాగా... తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో సచివాలయంలోని రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

వాయుగుండం హెచ్చరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతంలోని మత్స్యకారులు, ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. నర్సాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, పోడూరు, ఆచంట మండలాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. తుఫాను హెచ్చరికలతో కృష్ణా జిల్లాలో అధికారులను జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అప్రమత్తం చేశారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, విజయవాడ ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories