మద్యం హానికరం..నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దు: యాంకర్‌ ప్రదీప్‌

మద్యం హానికరం..నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దు: యాంకర్‌ ప్రదీప్‌
x
Highlights

మద్యం ఆరోగ్యానికి హానికరమని యాంకర్ ప్రదీప్ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డిసెంబర్ 31 రాత్రి పట్టుబడ్డ ప్రదీప్.. సోమవారం మధ్యాహ్నం గోషామహల్...

మద్యం ఆరోగ్యానికి హానికరమని యాంకర్ ప్రదీప్ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డిసెంబర్ 31 రాత్రి పట్టుబడ్డ ప్రదీప్.. సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు ప్రదీప్ తన తండ్రితో కలిసి హాజరయ్యారు. కౌన్సెలింగ్ అనంతరం ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు కౌన్సెలింగ్‌ సెషన్‌కు హాజరు కావాలని మెసేజ్‌ వచ్చింది. అందుకే వచ్చాను. ఇప్పటివరకు రాలేదంటని అంతా అనుకుంటున్నారు. తప్పించుకుంటున్నానని.. అజ్ఞాతంలోకి వెళ్లానని రకరకాలుగా అంటున్నారు. అలాంటిదేమీ లేదు. పోలీసులు నాకు కేటాయించిన తేదీని బట్టే ఇక్కడికి వచ్చాను. పోలీసులు విధించిన నిబంధనలను ఫాలో అవుతున్నా. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నా. పోలీసులు చాలా ఓపికతో బాగా వివరించారు. మద్యం తాగడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలకు గురయ్యేందుకు అవకాశాలు.. తదితర అంశాలను చక్కగా వివరించారు. తర్వాత జరిగే కార్యక్రమాలకు నేను హాజరవుతాను. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయవద్దు’’ అని తెలిపారు. తనకు మద్దతు ప్రకటించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యాంకర్ ప్రదీప్ చెప్పారు.

మద్యం హానికరం : యాంకర్ ప్రదీప్

Show Full Article
Print Article
Next Story
More Stories