పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరైన యాంకర్ ప్రదీప్

పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరైన యాంకర్ ప్రదీప్
x
Highlights

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్ వారం రోజుల తర్వాత టచ్‌లోకి వచ్చాడు. తండ్రితో కలిసి గోషామహల్ పోలీసు‌స్టేషన్‌కు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన...

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్ వారం రోజుల తర్వాత టచ్‌లోకి వచ్చాడు. తండ్రితో కలిసి గోషామహల్ పోలీసు‌స్టేషన్‌కు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రదీప్‌కు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రదీప్‌కు మూడు డాక్యుమెంటరీలను చూపించనున్నారు. కౌన్సెలింగ్ రూమ్‌లో తన తండ్రితో కలిసి ప్రదీప్ మొదటి వరుసలో కూర్చున్నాడు.

డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వాహనాలు నడిపిన ఎంతో మంది మందు బాబులకు వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే, ప్రదీప్ షూటింగులు ఉండడంతో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. తాను ఎక్కడికీ పారిపోలేదంటూ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరవుతానని ఆ వీడియోలో చెప్పిన ప్రదీప్.. ఎట్టకేలకు పోలీసులు ముందుకు వచ్చాడు. డిసెంబర్ 31న రాత్రి బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ప్రదీప్‌కు 178 పాయింట్లు వచ్చాయి. అంతేకాకుండా కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంపై ప్రదీప్‌పై మరో కేసు కూడా నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రదీప్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories