ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాద‌ని చెప్పింది చంద్ర‌బాబే

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాద‌ని చెప్పింది చంద్ర‌బాబే
x
Highlights

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం టీడీపీ తొల‌త ఢిల్లీలో ఆందోళ‌న చేప‌ట్టింది. అయితే ఆ పార్టీని ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో త‌ట్టాబుట్టా స‌ర్దుకొని ఏపీలో పోరాటం...

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం టీడీపీ తొల‌త ఢిల్లీలో ఆందోళ‌న చేప‌ట్టింది. అయితే ఆ పార్టీని ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో త‌ట్టాబుట్టా స‌ర్దుకొని ఏపీలో పోరాటం చేస్తుంది. అయితే తాము ఎంత ఆందోళ‌న చేసినా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాద‌ని చెబుతార‌ని , చంద్ర‌బాబు చెప్పారు కాబ‌ట్టే చేస్తున్నామ‌ని టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అని అన్నారంటూ వైసీపీ నేత అనంత వెంక‌ట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు.
జేసి దివాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు. ప్రధానిది కక్ష సాధింపు చర్యని... ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరగదన్నారు. అయినా నిరాశ చెందకుండా హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు జేసీ. ఇకపై ప్రజల్లోకి వెళ్లి నిరసనను తెలుపుతామన్నారు.
ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న విమర్శలపై జేసీ తీవ్రంగా మండిపడ్డారు. అవి దొంగ దీక్షలు అని, మూడ్రోజులు దీక్ష చేస్తే పోలీసులు వచ్చి తీసుకు వెళ్తారని, ఇదేనా దీక్ష అని, ఆమరణ దీక్ష చేసింది ఒకే ఒక్కడు మనవాడు, తెలుగువాడు పొట్టి శ్రీరాములు మాత్రమేనని జేసీ అన్నారు. వైసీపీ ఎంపీలు మూడ్రోజులు దీక్షచేయగానే సరిపోతుందా అని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన వెంక‌ట్రామిరెడ్డి ప్రత్యేక హోదా రాదని టీడీపీకి తెలిసినా ఆ పార్టీ రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు నిర్వహిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పైన టీడీపీకి చిత్తశుద్ధి లేదని అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. అందుకు జేసీ వ్యాఖ్యలే నిదర్శనం అని అభిప్రాయపడ్డారు.
ఇక‌ తమ ఎంపీల దీక్షను అవహేళన చేయడం జేసీకి సరికాదన్నారు. ఆయన వయస్సుకు తగిన, ఆయన హోదాకు తగిన మాటలు మాట్లాడాలని సూచించారు. అలా మాట్లాడి మర్యాద నిలుపుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories