టీడీపీకి ఆనం షాక్....? గుర్తింపు లేని చోట ఉండలేనని వ్యాఖ్య!

టీడీపీకి ఆనం షాక్....? గుర్తింపు లేని చోట ఉండలేనని వ్యాఖ్య!
x
Highlights

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ‘మీరు పార్టీ మారబోతున్నారట కదా?’ అంటూ విలేకరులు...

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ‘మీరు పార్టీ మారబోతున్నారట కదా?’ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆనం సమాధానమిచ్చారు. గౌరవం లేని చోట తాను ఉండలేనంటూ తేల్చి చెప్పి.. టీడీపీ వదిలేస్తున్నట్టు చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు, తాను గతంలో ఎన్నో పదవులు చేపట్టానని, సమర్థంగా పనిచేశానని పేర్కొన్నారు. గుర్తింపు, గౌరవం లేని చోట తాను ఉండలేనని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆనం బ్రదర్ టీడీపీని వీడటం ఖాయమని తేలిపోయింది. నెల్లూరు జిల్లాలో తమకెంతోమంది అభిమానులున్నారని, వాళ్లతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆయన నిన్న నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలను కలవడం కూడా దీనికి సంబంధించేనని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories