కలెక్టరమ్మ ప్రేమ కథ!

కలెక్టరమ్మ ప్రేమ కథ!
x
Highlights

యంగ్ అండ్ డైనమిక్.... అట్రాక్ట్ చేసే అందం. చిన్న వయస్సులోనే ఉన్నత స్థాయి. కట్టిపడేసే చలాకీ తనం అమె సొంతం. జిల్లా ప్రథమ పౌరురాలిగా .... విధుల్లోనూ తనకు...

యంగ్ అండ్ డైనమిక్.... అట్రాక్ట్ చేసే అందం. చిన్న వయస్సులోనే ఉన్నత స్థాయి. కట్టిపడేసే చలాకీ తనం అమె సొంతం. జిల్లా ప్రథమ పౌరురాలిగా .... విధుల్లోనూ తనకు తానే సాటి. ఆ ఐఏఎస్ కూడా ప్రేమలో పడింది. ఐపీఎస్ కు మనసిచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి బంధానికి చేరుకుంది. త్వరలోనే మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరా ప్రేమికురాలు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.

అమ్రాపాలి కాట. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్. చిన్న వయస్సులోనే ఐఏఎస్ గా ఎంపికయ్యారు. పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. అందరినీ కట్టి పడేసే లుక్ అమెది. యూత్ ఐ కాన్ వరంగల్ అర్బన్ కలెక్టర్‌ అమ్రాపాలి కాట. ఈ యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ అంటే చాలా మంది ఇష్టపడతారు. అమ్మాయిలు సైతం ఈమే అందం చూసి ఈర్య్శ పడతారు. ఈ ఆంధ్రాభామ అమ్రాపాలిని ఓ ఐపీఎస్ ఇష్టపడ్డారు. ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లుగా వీరి లవ్ స్టోరీ సాగింది.

విశాఖకు చెందిన కాటా వెంకటరెడ్డి అమ్రాపాలి తండ్రి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొపెసర్ గా పదవీ విరమణ చేశారు. అమ్రాపాలి మద్రాస్ ఐఐటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లామా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్ షిప్ బ్యాంకర్‌గా పనిచేశారు అమ్రపాలి కాట. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంక్ సాధించారు అమ్రపాలి. మంచి ర్యాంక్ రావటంతో సొంత రాష్ట్ర క్యాడర్ లో ఆమె ఐఏఎస్ గా ఎంపికయ్యారు.
స్పాట్‌
2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా బాద్యతలు నిర్వహించారు అమ్రపాలి. అనంతరం మహిళా శిశుసంక్షేమ శాఖ విభాగానికి మారారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్ గా 2016 అక్టోబర్ 11న బాధ్యతలు చేపట్టారు. వరంగల్ ను ఓడీఎఫ్ గా తీర్చిదిద్దటంలో అమ్రపాలి కీలక పాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు సైతం అందుకున్నారామె. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు అమ్రాపాలి, సెల్పీ టీచర్, చిన్నారి డాక్టర్ వంటి పథకాలను ప్రవేశిపెట్టి అందరి మన్ననలు పొందారు ఈ యంగ్ ఐఏఎస్ అమ్రాపాలి.

ఢిల్లీ కి చెందిన సమీర్ శర్మ ప్రస్తుతం డయ్యూలో ఎస్పీగా పనిచేస్తున్నారు. జమ్మూలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో చదివారు సమీర్. 2011 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ అమ్రాపాలి అందానికి ముగ్దుడయ్యారు. నాలుగేళ్ల క్రితం వీరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సమీర్ శర్శ కూడా మంచి అందగాడు. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు తెలిసినా వారిని ఒప్పించటంలో నాలుగేళ్లు పట్టిందని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవటంతో పెళ్లికి రెడీ అయిపోయారు ఈ యువ జంట.

పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. ఫిబ్రవరి 18న ఒక్కటవ్వబోతున్నారు అమ్రపాలి, సమీర్ శర్మ. వరంగల్ లో ఈ నెల 23న ఈ కొత్త జంట రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ఈ ప్రేమ జంట పెళ్లి జంటగా మారబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories