రివ్యూ: అమ్మమ్మగారిల్లు

రివ్యూ: అమ్మమ్మగారిల్లు
x
Highlights

సినిమా పేరు: అమ్మమ్మ‌గారిల్లు న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, షామిలి, సుమిత్ర‌, రావు ర‌మేష్‌, శివాజీరాజా, హేమ‌, సుధ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, ర‌విప్ర‌కాష్ త‌దిత‌రులు...

సినిమా పేరు: అమ్మమ్మ‌గారిల్లు
న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, షామిలి, సుమిత్ర‌, రావు ర‌మేష్‌, శివాజీరాజా, హేమ‌, సుధ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, ర‌విప్ర‌కాష్ త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం: ర‌సూల్ ఎల్లోర్‌
సంగీతం: క‌ళ్యాణ ర‌మ‌ణ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, భాస్క‌ర‌భ‌ట్ల
కూర్పు: జె.పి
నిర్మాత‌: రాజేష్‌
సంస్థ‌: స్వాజిత్ మూవీస్‌
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్ సూర్య‌
విడుద‌ల‌ తేదీ: 25-05-2018

'ఛలో' సినిమాతో హిట్ అందుకున్న హీరో నాగ శౌర్య ఈ సారి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'అమ్మమ్మగారిల్లు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2009లో వచ్చిన 'ఓయ్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరోయిన్ షామిలీ ఈ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గారీ ఎంట్రీ ఇచ్చింది. సుందర్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాపై టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఒక పాజిటివ్ బజ్ ఏర్పడింది. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మగారి ఇల్లు అనేది ఒక మధుర జ్ఞాపకం. ఆ తీపి జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అంచనాలను రీచ్ అయింది అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటంటే: సీతామహాలక్ష్మి(సుమిత్ర)ది పెద్ద కుటుంబం. ఆస్తి పంపకాలపై పేచీలు మొదలు కావడంతో కుటుంబ పెద్ద సూర్యనారాయణ(చలపతిరావు) కలత చెంది చనిపోతాడు. దాంతో కుటుంబం చెల్లాచెదురవుతుంది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు తలో దిక్కు వెళ్లిపోతారు. 20 ఏళ్లయినా తిరిగిరారు. కానీ, చిన్నప్పుడే అమ్మమ్మతో అనుబంధం ఏర్పరుచుకున్న సంతోష్‌(నాగశౌర్య) అందర్నీ కలపాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఏం చేశాడు? అమ్మమ్మ ముఖంలో సంతోషం ఎలా నింపాడు? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: తెలిసిన కథే. అదే కుటుంబం.. అవే బంధాలు.. కానీ, పలు సన్నివేశాలు హృదయాల్ని హత్తుకుంటాయి. చాలా రోజుల తర్వాత మరొక స్వచ్ఛమైన కుటుంబ కథను చూసిన అనుభూతికి గురిచేస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చినా కుటుంబ కథలు మళ్లీ మళ్లీ తెరకెక్కడం.. వాటిని ప్రేక్షకులు ఆదరించడం వెనుక కారణం బంధాలు-అనుబంధాల గొప్పతనాలే. ప్రతి ప్రేక్షకుడికి వేగంగా కనెక్ట్‌ అయ్యే విషయాలివి. కాకపోతే వాటి మధ్య సంఘర్షణ సరైన రీతిలో పండేలా చూసుకోవాలి. ఆ విషయంలో ఈ చిత్ర దర్శకుడు సఫలమయ్యాడు. అక్కడడక్కడా నవ్విస్తూ హృదయాల్ని మెలిపెడుతూ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఆరంభ సన్నివేశాలు హత్తుకుంటాయి. ప్రేక్షకుడిని త్వరగా కథలో లీనం చేస్తాయి. ముఖ్యంగా రావురమేశ్‌, నాగశౌర్య పాత్రలను అల్లిన విధానం చాలా బాగుంది. మధ్యలో కథ కాస్త మందగమనంతో సాగడం, సంతోష్‌, సీత(షామిలి)పాత్రల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల్లో బలం లేకపోవడం, కథలో పెద్ద మలుపులు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ వాటి గురించి పెద్దగా ఆలోచించనీయకుండా దర్శకుడు సినిమాను ముందుకు నడిపించాడు. భావోద్వేగాలు, స్వచ్ఛమైన వినోదం, కుటుంబ నేపథ్యం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు. నాగశౌర్య ఈ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడు.



సీతమ్మ మనవడు సంతోష్ పాత్రలో నాగ శౌర్య సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషన్ సీన్లలో చాలా నేచురల్ గా నటించాడు. కుటుంబం మొత్తాన్ని కలిపి అమ్మమ్మ ముఖంలో సంతోషం చూడటానికి నాగ శౌర్య చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఒకప్పుడు బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శాలిని.... ఆ మధ్య ‘ఓయ్' సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. అయితే లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోలేక పోయింది. ‘అమ్మమ్మగారిల్లు' సినిమాలో కూడా శాలిని మరోసారి నిరాశ పరిచింది. లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా గొప్పగా లేదు కాబట్టే దర్శకుడు కూడా సినిమాలో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్లు పెద్దగా పెట్టలేదేమో? సినిమా ఏదైనా అందులో ఒక విలన్ షేడ్స్ ఉన్న పాత్ర ఉండాల్సిందే. ఆ బాధ్యత ఈ చిత్రంలో రావు రమేష్ చేపట్టారు. రావు రమేష్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టారు. శివాజీ రాజా, సుధ, హేమ, పోసాని, సుమన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో పక్కన ఉండే కమెడియన్ పాత్రలో శకలక శంకర్ అక్కడక్కడ నవ్వులు పూయించాడు.
శివాజీ రాజా, సుమిత్ర, రవి ప్రకాశ్‌, హేమ, సుధ తదితరుల పాత్రలు అలరిస్తాయి. స్నేహితుడి పాత్రలో షకలక శంకర్‌ నవ్విస్తాడు. పోసాని, గౌతం రాజు, సమ్మెట గాంధీ తదితరులు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా మాటలు చిత్రానికి ప్రాణం పోశాయి. దర్శకుడు పాత కథనే కొత్తగా తీర్చిదిద్దిన విధానం మెచ్చుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కల్యాణ్‌ రమణ సంగీతం, ఛాయాగ్రహణం దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా కుదిరాయి.

బలాలు
+ నాగశౌర్య, రావు రమేశ్‌ నటన
+ భావోద్వేగాలు, హాస్యం
+ కుటుంబ నేపథ్యం

బలహీనతలు
- తెలిసిన కథ
- అక్కడక్కడా నత్తనడకన సాగే సన్నివేశాలు

Show Full Article
Print Article
Next Story
More Stories