అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా!

అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా!
x
Highlights

కొన్ని పాటలు మన హృదయాన్ని భరువుతో నింపేస్తాయి...అలంటి పాటే...అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా. ఈ పాట పాండురంగ మహత్యం (1957) సినిమా లోని విషాద గీతం....

కొన్ని పాటలు మన హృదయాన్ని భరువుతో నింపేస్తాయి...అలంటి పాటే...అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా. ఈ పాట పాండురంగ మహత్యం (1957) సినిమా లోని విషాద గీతం. దీనిని సముద్రాల రామానుజాచార్య రచించాడు. దీనికి టి.వి. రాజు సంగీతం సమకూర్చగా ఘంటసాల వెంకటేశ్వరరావుఆలపించాడు. నందమూరి తారక రామారావు అడవిలో దేక్కుంటూ విలపిస్తున్న అభినయం అద్భుతం. హృదయం ఉన్నవారందరికీ ఈ పాట కంటతడి పెట్టిస్తుంది. చివరగా కొండ మీద నుండి పడిపోతున్న పుండరీకున్ని కృష్ణుని పాత్రలో విజయనిర్మల రక్షించి తనని దైవం వైపుగా నడిపించడానికి నాంది పలుకుతుంది.
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా ||| అమ్మా |||
పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి
మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసినా
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితి
తలచకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మా అమ్మా... అమ్మా...
దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితి
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా... నాన్నా...
మారిపోతినమ్మా నా గతి ఎరిగితినమ్మా
నీ మాట దాటనమ్మ ఒకమారు కనరమ్మా
మాతా పిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా
నన్ను మన్నించగ రారమ్మా అమ్మా... అమ్మా...
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా అమ్మా
ఈ పాట వింటే ఎవరి మనసైన కదిలిపోతుంది... శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories