సీఎం కేసీఆర్‌పై అమిత్‌ షా ఫైర్‌... అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు

సీఎం కేసీఆర్‌పై అమిత్‌ షా ఫైర్‌... అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు
x
Highlights

ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కాలేజీ...

ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఉదయం 11 గంటలా 30 నిముషాలకు బేగంపేట్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనకు రాష్ట్రానికి చెందిన కాషాయ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఆ తర్వాత అమిత్‌ షా వెంటనే దోమలగూడలోని బీమా మైదాన్‌లో స్వచ్ఛతాహీ సేవ అభియాన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అటు వెంటనే పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్‌పై డైరెక్ట్‌ అటాక్‌ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇప్పటివరకు కేంద్రం నుంచి రెండు లక్షలా 30 వేల కోట్ల నిధులిచ్చినట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ఆయన ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వివరించారు.

మీడియా సమావేశం తర్వాత అమిత్ షా మహబూబ్‌నగర్‌కు బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యంలో లాల్‌దర్వాజలోని సింహవాహిని మహాంకాళీ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories