తెలంగాణ బీజేపీకి అమిత్ షా తలంటు...ముందస్తు వస్తే ఏం...

తెలంగాణ బీజేపీకి అమిత్ షా తలంటు...ముందస్తు వస్తే ఏం...
x
Highlights

తెలంగాణ బీజేపీకి అమిత్ షా క్లాస్ పీకారు. ఓ పక్క ముందస్తు ఊహాగానాలు వినిపిస్తుంటే పార్టీ నేతలు నిద్దరోతున్నారంటూ మండిపడ్డారు. సాధ్యమైనంత త్వరగా...

తెలంగాణ బీజేపీకి అమిత్ షా క్లాస్ పీకారు. ఓ పక్క ముందస్తు ఊహాగానాలు వినిపిస్తుంటే పార్టీ నేతలు నిద్దరోతున్నారంటూ మండిపడ్డారు. సాధ్యమైనంత త్వరగా పార్టీని దారికి తేకపోతే ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.

తెలంగాణ బీజేపీకి తలంటు మొదలైంది చాలాకాలం తర్వాత రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో బీజేపీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టతపైనా, బలోపేతంపైనా రాష్ట్ర నేతలు దృష్టి పెట్టడం లేదని బీజేపీ అంతరంగిక సమావేశమైన విస్తారక్ బైఠక్ లో సీరియస్ అయ్యారు. రాష్ట్ర నేతలు జిల్లా పర్యటనలు చేయడం మానేసారని విమర్శించారు. నిత్యం ప్రజల మధ్య ఉండాల్సింది పోయి కేడర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బూత్ కమిటీల ఏర్పాటులో పార్టీ గైడ్ లైన్స్ పట్టించుకోడం లేదని తప్పుబట్టారు. పార్టీ కేంద్ర కమిటీ 23 గైడ్ లైన్స్ ను మార్గదర్శకంగా తీసుకొవాల్సిందిగా సూచించగా అందులో 13 నిబంధనలను మాత్రమే అనుసరించడంపై ఫైర్ అయ్యారు. ఇలా అయితే రాష్ట్రంలో బీజేపీ గెలుపు కష్టమేనని అమిత్ షా నేతలకు క్లాస్ పీకారు.. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని గతంలోనే చెప్పినా రాష్ట్ర నేతలు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ముందస్తు ఎన్నికలొస్తే పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సొంత ఎజెండాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు.

తెలంగాణ లో 2019 ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా వ్యూహం రచించడానికి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు రాష్ట్ర నేతలతో మాట్లాడటం వారికి దిశా నిర్దేశం చేయడం పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవడం ప్రచార కార్యక్రమాన్ని నిర్ణయించడం అమిత్ షా టూర్ లో భాగాలు షా వస్తున్నారన్న ఉత్సాహంతో బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఆయనకు భారీ స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారన్న అంచనాతో ఓ వేదికను సైతం ఏర్పాటు చేశారు. కానీ విమానాశ్రయంలో దిగిన అమిత్ షా వేదికపైకి వచ్చి చేయి ఊపి వెనుదిరిగిపోయారు. దీంతో తెలంగాణ సీనియర్ నేతలంతా బిత్తర పోయారు. షా వస్తారని చెప్పి కార్యకర్తలను రమ్మన్న నేతలు వారికేం చెప్పాలో తెలీక కంగు తిన్నారు. అమిత్ షా ప్రసంగం కోసం ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. అయితే విమానాశ్రయంలో వేదిక ఏర్పాటు చేసిన సమాచారం అమిత్ షాకు ఇవ్వలేదని అందుకే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని మరికొందరు చెబుతున్న మాట. అక్కడ మాట్లాడాల్సి వస్తే టిఆరెస్ పార్టీపై విమర్శలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే మాట్లాడి ఉండరని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా తమ నాయకుడు దిశానిర్దేశం చేస్తారనుకున్న కార్యకర్తలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు దగ్గర నిరాశే ఎదురైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories