సంచలన నిర్ణయం తీసుకున్న క్రికెటర్‌ అంబటి రాయుడు

nanireddy
Updated on: 24 Dec 2018 3:48 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న క్రికెటర్‌ అంబటి రాయుడు
X

భారత క్రికెటర్‌ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌కు గుడ్‌ బై చెప్పాడు. ఈ మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)కు లేఖ రాశాడు. 'నేను హైదరాబాద్‌కు ఆడిన ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. దాన్ని చాలా గౌరవంగా భావించాను. నాకు హెచ్‌సీఏ నుంచి వచ్చిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. నా సహచర ఆటగాళ్లు మద్దతు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడదలుచుకోలేదు. కేవలం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడతాను' అని లేఖలో పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించి తనదైన ముద్ర వేసిన రాయుడు ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాడు

nanireddy

nanireddy

Next Story