ఆయన్ను నమ్మితే కుక్క తోకతో గోదారి ఈదినట్లే

ఆయన్ను నమ్మితే కుక్క తోకతో గోదారి ఈదినట్లే
x
Highlights

చంద్రబాబు నాయుడును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం...

చంద్రబాబు నాయుడును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం వైఎస్సా్‌ర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా టీడీపీ పెద్ద డ్రామాకు తెరలేపిందన్నారు అంబటి రాంబాబు. కేంద్రంపై ముందుగా అవిశ్వాసం పెట్టినప్పుడు వైసీపీని పరిహాసం చేసి ఇప్పుడు టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించారన్నారు. వైసీపీ అవిశ్వాసం ఇచ్చినప్పుడు చర్చ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. దీనిని బట్టి చూస్తే టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిరిందని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories