అమరావతి హైపర్‌లూప్ సాధ్యమయ్యేనా? 

అమరావతి హైపర్‌లూప్ సాధ్యమయ్యేనా? 
x
Highlights

అభివృద్ధ్ది చెందిన దేశాల్లో హైపర్‌లూప్ ప్రయాణాలకు ప్రధాన కారణాలు మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, మానవ వనరుల లభ్యత. అయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో...

అభివృద్ధ్ది చెందిన దేశాల్లో హైపర్‌లూప్ ప్రయాణాలకు ప్రధాన కారణాలు మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, మానవ వనరుల లభ్యత. అయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఇంతటి జనాభాకు దీటైన రవాణా వ్యవస్థను ఏర్పరచడం ఆశామాషీ వ్యవహారం కాదు. అందుకే ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ఇప్పుడు నూతన రాజధాని ప్రాంతంలో విమానం కంటే వేగంగా ప్రయాణించ సాధ్యంకాగల హైపర్ లూప్ రవాణా వ్యవస్థను దేశంలోనే తొలిసారి నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ మధ్య హైపర్‌లూప్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం అమెరికాకు చెందిన సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.

ఈ రంగంలో అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ అన్నింటికంటే ముందు వరుసలో ఉంది. దీని సాయంతో మన దగ్గర ఇలాంటి రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అను కుంటున్నట్లు జరిగితే ఇండియాలో హైపర్‌లూప్ ట్రైన్ల రాకపోకలను మనం చూడొచ్చు. తక్కువ సమయంలో ప్రయాణం చేయడానికి నగరాల్లో ట్రాఫిక్ కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలను వెదుకుతూనే ఉంటారు. అయితే హైపర్‌లూప్ ఏర్పాటు సాధ్యమైతే విజయవాడ- అమరావతి మధ్య చకాచకా తిరిగేయొచ్చు. దాదాపు 35 కి.మీ దూరాన్ని 5 నిమిషాల్లో ప్రయాణించవచ్చు.

ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు, హైప ర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్(హెచ్టీటీ)తో జట్టుకట్టింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని నిర్మిస్తారు. అయితే అధికారికంగా కుదుర్చు కున్న ఎంవోయూలో ప్రాజెక్టు ఖర్చు వివరాలు వెల్లడించలేదు. హైపర్‌లూప్ రవాణా ఒక గుండ్రటి ట్యూబ్ లాంటి వ్యవస్థలో లోపల ఈ ట్రైన్లు నడుస్తాయి. టెస్లా వ్యవస్థాపకుడు ఈలన్ మస్క్ మెదడు నుంచి పుట్టిన ఆలోచన ఇది. 2013లో దీని బేసిక్ డిజైన్‌కు సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ఓపెన్ సోర్స్ చేశారు. ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ట్యూబ్ మాడ్యులర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ద్వారా హైపర్‌లూప్ సాధ్యపడుతుంది. అయితే వివిధ దేశాల్లో ఇప్పటికీ ఇది పరీక్షల దశలోనే ఉంది. ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది? వచ్చే నెల నుంచి హెచ్‌టీటీ ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టును తయారుచేసేందుకు అధ్యయనం మొదలుపెడుతుంది. ఈ సమయంలో ఎత్తైన భవంతుల మీదుగా రెండు నగరాల మధ్య ఉత్తమ మార్గాన్ని అన్వేషిస్తారు. ఆరు నెలల పాటు అధ్యయనం జరిగిన తర్వాత దేశంలోనే మొదటి హైపర్‌లూప్ ట్రైన్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రారంభం చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories