స్టైలిష్ ను ఎలా మరిచి పోగలను

ప్రియా ప్రకాశ్ వారియర్ 20 సెకన్ల వీడియోలో ఆమె చూసిన చూపు దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ‘ఒరు ఆధార్...
ప్రియా ప్రకాశ్ వారియర్ 20 సెకన్ల వీడియోలో ఆమె చూసిన చూపు దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ‘ఒరు ఆధార్ లవ్’ చిత్రంలోని ఓ పాటలో కన్ను గీటిన వారియర్ అభిమానుల్ని ఫిదా చేసింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డంను సంపాదించింది. ఏ అభిమాని, ఏ ఇండస్ట్రీ అయినా యాక్టర్లతో సంబంధం లేకుండా వారియర్ ను ఇష్టపడేందుకు వెనుకాడడంలేదు.
అంతేకాదు ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ అమ్మాయి చూపులకు పడిపోయి ‘ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోని నేనసలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆమె స్టార్ డం ను దెబ్బకొట్టేలా కొంతమంది ఆమెపై కేసులు పెట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కేరళ సీఎం కూడా వారియర్ కు అండగా నిలిచారు.
కేరళలో భావన ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమెదించబోమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారియర్ యాక్ట్ చేసిన పాటను 1978లో ఆకాశ వాణిలో ప్రసారం చేసారని అన్నారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బార్ రాసిన గేయాన్ని రఫీఖ్ పాడారని తెలిపారు. ముస్లింల వివాహాల్లో ఈ పాటను దశాబ్దాలుగా పాడుతూనే ఉన్నారని విజయన్ పేర్కొన్నారు. ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలని ఆయన తెలిపారు.
అయితే తాజాగా ఓ మళయాళ టీవీ ఛానల్ షో లో పాల్గొన్న ప్రియా.. అల్లు అర్జున్ ఇచ్చిన కామెంట్ పట్ల రియాక్ట్ అయింది. ‘అభిమానుల నుండి వచ్చిన ఇంతటి ఆదరణతో పాటు ముఖ్యంగా అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం మరపురానిది. కేరళలో అల్లు అర్జున్ కి ఎంతోమంది అభిమానులున్నారు’ అని చెప్పుకొచ్చింది ప్రియా.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT