ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరు ఉధృతం

ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరు ఉధృతం
x
Highlights

కేంద్రంపై అవిశ్వాసం తర్వాత జరుగుతున్న ధర్మపోరాట దీక్షను సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ ఎంపీలంతా ఒంగోలు ధర్మపోరాట సభకు...

కేంద్రంపై అవిశ్వాసం తర్వాత జరుగుతున్న ధర్మపోరాట దీక్షను సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ ఎంపీలంతా ఒంగోలు ధర్మపోరాట సభకు హాజరుకావాలని ఆదేశించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడుతున్న ఎంపీలు ప్రజాక్షేత్రంలో వస్తున్న స్పందనను చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అవిశ్వాసం సందర్భంగా టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో వినిపించిన వాదనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చంద్రబాబు అన్నారు.

ప్రకాశం జిల్లాలో ధర్మపోరాట సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత తొలిసారి జరుగుతున్న ఈసభను జిల్లా టీడీపీ నేతలు ‎ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు వారం రోజులగా ఇక్కడే మకాం వేసి పార్టీ శ్రేణులను ఏకం చేశారు. ఇప్పటికే కేంద్రంపై మాటల దాడి తీవ్రతరం చేసిన చంద్రబాబు ఈ రోజు ఎయే అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తిగా మారింది. విభజన హామీలను ప్రస్తావించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ తీరును ఒంగోలు వేదికగా ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని పార్ట శ్రేణులు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories