Top
logo

దేశరాజకీయాలకు ప్లీనరీ వేదిక : ఈటెల

దేశరాజకీయాలకు ప్లీనరీ వేదిక : ఈటెల
X
Highlights

దేశ రాజకీయాలకు టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక కాబోతుందని.. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కొంపల్లిలో...

దేశ రాజకీయాలకు టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక కాబోతుందని.. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కొంపల్లిలో ప్లీనరీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలనదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు ఈటల. ఎన్నో అవమానాలు భరించి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. కేసీఆర్ దీక్షా దక్షతలను గుర్తించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నరు. అనుభవమున్న పార్టీల కంటే తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలన బాగుందన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

Next Story